న్యూఢిల్లీ: మైనార్టీ విద్యార్థులకు ప్రి మెట్రిక్ స్కాలర్‌షిప్‌లతో పాటు మౌలానా ఆజాద్ ఫెలోషిప్‌ను పునరుద్దరించాలని ఇవాళ లోక్‌సభలో ఇద్దరు ఎంపీలు డిమాండ్ చేశారు. మైనార్టీలను వదిలేస్తే దేశం ఎలా అభివృద్ధి సాధిస్తుందని ఆ ఎంపీలు ప్రశ్నించారు. ఉన్నత విద్యను అభ్యసించే మైనార్టీలకు మౌలానా ఆజాద్ ఫెలోషిప్‌ను ఇస్తున్నారు. అలాగే ఒకటో తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ప్రి మెట్రిక్ స్కాలర్షిప్ ఇస్తోంది. అయితే ఈ అంశాలపై బీఎస్పీ ఎంపీ దనిశ్ అలీ మాట్లాడుతూ.. ప్రి మెట్రిక్ సాల్కర్షిప్ను, మౌలానా ఆజాద్ ఫెలోషిప్‌ను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ఎంఐఎం ఎంపీ సయ్యిద్ ఇంతియాజ్ జలీల్ కూడా ఇదే అంశంపై మాట్లాడారు. ఫెలోషిప్‌ను ఆపేస్తే మైనార్టీ విద్యార్థులు ఎలా చదువుకుంటారని ఆయన ప్రశ్నించారు.