ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ ఇచ్చినప్పుడు టైంకి డెలివరీ అవుతుందో లేదో అని టెన్షన్ పడుతుంటాం. కానీ ఆ డెలివరీ ఇచ్చేందుకు డెలివరీ ఏజెంట్లు పడే కష్టాలు ఎలా ఉంటాయో మనకు తెలీదు. ఇటీవల సోషల్ మీడియాలో ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెటిజన్ల మనసులు గెలుచుకుంటున్న సంగతి తెలిసిందే.
ఒక రైల్వే స్టేషన్లో డెలివరీ ఇచ్చేందుకు వచ్చాడో డంజో (డెలివరీ సర్వీసింగ్ యాప్) డెలివరీ బాయ్. అతను వచ్చే సరికి ఆర్డర్ చేసిన కస్టమర్ రైలు ఎక్కేసింది. రైలు బయలు దేరడంతో అతను రైలు ప్లాట్‌ఫాంపై పరిగెత్తి మరీ డెలివరీ ఇచ్చాడు. రైలు ఫుట్‌బోర్డ్ వద్ద ఆమె చెయ్యి జాచి నిలబడితే ఇతను పరిగెత్తుకుంటూ వెళ్లి ఎలాగైతేనేం డెలివరీ పూర్తి చేశాడు.
దాంతో కస్టమర్ సంతోషపడిపోవడం కూడా వీడియోలో కనిపించింది. ఈ వీడియో నెట్టిజన్ల మనసులు గెలుచుకుంటోంది. సదరు డెలివరీ బాయ్ డెడికేషన్‌ను అందరూ మెచ్చుకుంటున్నారు. అలాంటి డెలివరీ బాయ్‌కు ప్రమోషన్ ఇవ్వాలని కొందరు అంటుంటే.. పది రెట్లు టిప్ ఇచ్చినా తక్కువేనని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మీరు కూడా ఆ డెలివరీ బాయ్ సాహసం చూడండి.
Just Came Across This Viral Video. His Dedication Is Really Amazing! #DDLJ #TrendingReels #SRK #Dunzo @DunzoIt @iamsrk @itsKajolD pic.twitter.com/GfGp0zmQLF
— Prathamesh Avachare (@onlyprathamesh) September 15, 2022