న్యూఢిల్లీ: 334 నమోదిత, గుర్తింపు పొందని పార్టీలను డీలిస్ట్ చేసినట్లు ఎన్నికల కమిషన్ (ఈసీ) శనివారం ప్రకటించింది. నిబంధనల ప్రకారం ఆరు సంవత్సరాల్లో కనీసం ఒకసారైనా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ పార్టీలు 2019 నుంచి ఈ నిబంధన పాటించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ పార్టీల కార్యాలయాలు దేశంలో ఎక్కడా లేవని పేర్కొంది. మొత్తం నమోదైన గుర్తింపు లేని పార్టీలు 2,854 కాగా, తాజా ప్రక్షాళన తర్వాత మిగిలినవి 2,520 పార్టీలు. ప్రస్తుతం దేశంలో ఆరు జాతీయ పార్టీలు, 67 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి.