Swati Maliwal case : ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ స్వాతి మాలివాల్‌పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్‌కు కోర్టు మళ్లీ మూడు రోజుల పోలీస్ట్ కస్టడీ విధించింది. ఇటీవల బిభవ్‌కు విధించిన నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగియడంతో పోలీసులు ఆయనను తీస్ హజారీ కోర్టులో హాజరుపర్చారు. మరో మూడు రోజులు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరారు.
దాంతో బిభవ్‌కు కోర్టు మరో మూడు రోజులు పోలీస్ కస్టడీ విధించింది. ఈ నెల 18న బిభవ్‌ను అరెస్ట చేసిన వెంటనే పోలీసులు కోర్టులో హాజరుపర్చగా ఐదురోజుల పోలీస్ కస్టడీకి పంపింది. ఐదు రోజుల పోలీస్ కస్టడీ ముగియగానే పోలీసుల అభ్యర్థన మేరకు నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇప్పుడు నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీ కూడా ముగియడంతో మళ్లీ మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది.
కాగా, ఇటీవల కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లిన సమయంలో కేజ్రీవాల్ పీఏ బిభవ్‌కుమార్ తనపై దాడికి పాల్పడ్డాడని ఆప్ ఎంపీ స్వాతిమాలివాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు బిభవ్‌ను ఈ నెల 18 అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా ముందుగా ఐదు రోజుల పోలీస్ కస్టడీ, తర్వాత నాలుగు రోజుల జ్యుడీషియల్ కస్టడీ, ఇప్పుడు మళ్లీ మూడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది.
#WATCH | AAP MP Swati Maliwal assault case | Delhi’s Tis Hazari Court remands back Bibhav Kumar to Police custody for three days. He was produced before the court after the expiry of four-day judicial custody
Visuals from the court as Police personnel bring him out after… pic.twitter.com/bXr3xOso5c
— ANI (@ANI) May 28, 2024