కేజ్రీవాల్‌కు బెయిల్
మద్యం పాలసీ మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది.
- మంజూరు చేసిన ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు
- ఉత్తర్వులు 48 గంటలు నిలుపుదల చేయాలన్న ఈడీ అభ్యర్థన తిరస్కరణ
- నేడు జైలు నుంచి బయటకు
- ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేయనున్న ఈడీ
న్యూఢిల్లీ, జూన్ 20: మద్యం పాలసీ మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లేందుకు బెయిల్ ఉత్తర్వులపై 48 గంటల పాటు నిలుపుదల చేయాలన్న ఈడీ అభ్యర్థనను ప్రత్యేక జడ్జి నియయ్ బిందు తిరస్కరించారు. రూ.లక్ష వ్యక్తిగత బాండ్ పూచీకత్తుపై కేజ్రీవాల్‌ను విడుదల చేయాలని ఆదేశించారు. కేజ్రీవాల్ శుక్రవారం తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు ముందు జడ్జి షరతులు విధించారు. దర్యాప్తును అడ్డుకోకూడదని, సాక్ష్యులను ప్రభావితం చేయకూడదని స్పష్టం చేసింది. అవసరమైన సమయంలో కోర్టుకు హాజరుకావాలని, అదేవిధంగా దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించారు. కాగా, కేజ్రీవాల్‌కు బెయిల్‌ను ఈడీ శుక్రవారం హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉన్నది.
పక్కా కుట్రతో కేజ్రీవాల్‌ను ఇరికించారు!
కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని ఆయన తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదించారు. పీఎంఎల్ఏ కింద దాఖలు చేసిన ఏ చార్జిషీట్లోనూ కేజ్రీవాల్ పేరు లేదని వాదించారు. ‘ఈడీ ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థనా? లేక కొంత మంది రాజకీయ నేతల చేతుల్లో ఆడే సంస్థనా?’ అని అన్నారు. అప్రూవర్ల స్టేట్మెంట్ల ఆధారంగా కేజ్రీవాల్‌ను ఇరికించారని కోర్టుకు తెలిపారు. అరెస్టు చేసిన కొంత మందికి బెయిల్ వచ్చేట్టు చేస్తామని ముందుగానే హామీ ఇచ్చారని వాదనలు కేజ్రీవాల్‌కు బెయిల్ నేపథ్యంలో ఆప్ నేతలు సంబరాలు చేసుకొన్నారు. కేజ్రీవాల్‌ను ఇరికించేందుకు రూపొందించిన ఫేక్ కేసు ఇది అని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ విమర్శించారు. సత్యం గెలిచిందని, కోర్టుల పట్ల విశ్వాసం ఉన్నదని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పోస్టు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సూపర్ స్ట్రయికర్.. కొత్త కారు అందుకున్న వైభవ్ సూర్యవంశీ
Sharwanand | శర్వానంద్ ‘భోగి’ మళ్లీ వాయిదా పడనుందా .. ఇంకా క్లారిటీ ఇవ్వని మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

