Air Pollution | దేశరాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువైంది. దీపావళి పండుగకు ముందే వాయు నాణ్యత క్షీణించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తక్కువగా ఉన్నట్లు కాలుష్య నియంత్రణ మండలి పేర్కొంది. సోమవారం ఉదయం 9 గంటల సమయానికి ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 221గా నమోదైనట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపింది.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (Central Pollution Control Board) ప్రకారం.. ఎన్సీఆర్లో ఘజియాబాద్‌లో 265, నోయిడాలో 243, గ్రేటర్ నోయిడాలో 228 సహా పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత అధ్వానంగా ఉంది. ఇక గురుగ్రామ్‌లో 169, ఫరీదాబాద్‌లో 177గా గాలి నాణ్యత నమోదైంది. మరోవైపు దేశ రాజధానిలో సోమవారం కనిష్ట ఉష్ణోగ్రత 18.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది.
ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రిసెర్చ్ నివేదిక ప్రకారం.. గాలి నాణ్యత 447కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని, AQI 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని అర్థం. ఇక AQI 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, AQI 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చు. కాగా, ఈ మధ్య ఢిల్లీలో వాయు కాలుష్యం ఆందోళనకరంగా మారుతున్న విషయం తెలిసిందే.
Also Read..
Cracker Ban | వాయు కాలుష్యం.. ఈసారి కూడా ఢిల్లీలో బాణా సంచాపై నిషేధం
Toll Free | మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ముంబైకి వెళ్లే ఆ వాహనాలకు నో టోల్
CPI Narayana | సాయిబాబాది సహజ మరణం కాదు, అది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే : సీపీఐ నారాయణ