న్యూఢిల్లీ: దీపావళి తర్వాత దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. సుప్రీంకోర్టు విధించిన మూడు గంటల పరిమితిని ఉల్లంఘించి చాలా మంది ప్రజలు టపాసులు కాల్చడంతో మంగళవారం ఢిల్లీలోని రెడ్ జోన్లో వాయు నాణ్యత చాలా తక్కువ(వెరీ పూర్) స్థాయిలో నమోదైంది.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి బులెటిన్ ప్రకారం మంగళవారం ఉదయం 8 గంటలకు వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) 352 పాయింట్లుగా నమోదైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిమితి కంటే ఇది 15 రెట్లు ఎక్కువ. ఈ నెల 20న ఏక్యూఐ 345 పాయింట్లుగా నమోదైంది.