న్యూఢిల్లీ: ఢిల్లీ-డెహ్రాడూన్ మధ్య ఎక్స్‌ప్రెస్‌వే(Delhi-Dehradun Expressway)ను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. సుమారు 11,868 కోట్లతో ఆ ప్రాజెక్టు చేపట్టారు. 212 కిలోమీటర్ల మేర ఎక్స్‌ప్రెస్ వే నిర్మించారు. దీన్ని ఢిల్లీ-డెహ్రాడూన్ ఎకనామిక్ కారిడార్‌గా కూడా పిలుస్తున్నారు. యూపీలోని షమరాన్పూర్ అటవీ ప్రాంతంలో ఎక్స్‌ప్రెస్‌వే కోసం బ్రిడ్జ్‌లను నిర్మించారు. డెహ్రాడూన్ సమీపంలో ఉన్న జై మా దాత్ కాళి ఆలయంలో మోదీ పూజలు చేయనున్నారు. దేశరాజధాని ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ వరకు ఈ ఎక్స్‌ప్రెస్ వేతో ప్రయాణ సమయం తగ్గనున్నది. ఆరు గంటలు పట్టే సమయాన్ని తగ్గించారు. ఇప్పుడు కేవలం రెండున్నర గంటల్లోనే డెహ్రాడూన్ చేరుకుంటారు. ఛార్థామ్ యాత్రికులకు ఇది కీలక రోడ్డుమార్గం కానున్నది.
2021లో ఈ ప్రాజెక్టును లాంచ్ చేశారు. నితని గడ్కరీ దీనికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ప్రధాని మోదీ ఆ ఏడాది డిసెంబర్‌లోనూ మరో శంకుస్థాపన చేశారు. వాస్తవానికి 2024 డిసెంబర్ నాటికి ఎక్స్‌ప్రెస్‌వే పూర్తికావాలి. ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణంలో భాగంగా 100 అండర్‌పాస్‌లను కట్టారు. అయిదు రైల్వే ఓవర్‌బ్రిడ్జ్‌లు కూడా ఉన్నాయి. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే, ఈస్ట్రన్ పెరిఫెరల్ ఎక్స్ఫ్రెస్వేలకు కూడా ఇది కనెక్ట్ అవుతుంది. హరిద్వార్, రూర్కీ వెళ్లే మార్గాలకు కూడా కొత్త హైవే కలుస్తుంది.
ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణ సమయంలో వన్యప్రాణుల రక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. రాజాజీ నేషనల్ పార్క్‌లో సుమారు 12 కిలోమీటర్ల ఎలివేట్ వైల్డ్‌లైఫ్ కారిడార్‌ను నిర్మించారు. జంతువుల రక్షణ నేపథ్యంలో ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మించారు. దీంట్లో ఆరు జంతువుల అండర్‌పాస్‌లు, 8 జంతు పాస్‌లు, 200 మీటర్ల పొడువైన రెండు ఏనుగు మార్గాలతో పాటు దాత్ కాళీ ఆలయం సమీపంలో 370 మీటర్ల టన్నెల్‌ను నిర్మించారు. 4 దశల్లో ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం సాగింది.
#WATCH | Uttarakhand: The Dehradun–Delhi Expressway, which is set to be inaugurated tomorrow by Prime Minister Narendra Modi, has an estimated total cost of around Rs 12,000 to Rs 13,000 crore.
The project also features Asia’s longest elevated wildlife corridor, spanning… pic.twitter.com/TZx8WYyQep
— ANI (@ANI) April 13, 2026