న్యూఢిల్లీ, నవంబర్ 23: కేవలం రూ.350 కోసం 16 ఏండ్ల యువకుడు మరో టీనేజర్‌ను అత్యంత పాశవికంగా హత్య చేశాడు. ఈశాన్య ఢిల్లీలోని వెల్కమ్ ఏరియాలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యింది. టీనేజర్ తల, మెడ, కంటిపై నిందితుడు 60 సార్లు కత్తితో పొడిచి.. అత్యంత కర్కశంగా వ్యవహరించాడు. తల నరికేందుకు ప్రయత్నించటం, ప్రాణాలు కోల్పోయిన టీనేజర్‌ను చూసి.. యువకుడు డ్యాన్స్ చేయటం సీసీటీవీ వీడియోలో కనపడింది. ఈ దారుణ హత్యకు పాల్పడ్డ 16 ఏండ్ల యువకుడ్ని బుధవారం ఉదయం పోలీసులు పట్టుకున్నారు.