Delhi teen murder case | నిందితుడు సాహిల్‌కు రెండు రోజుల పోలీస్ కస్టడీ విధించిన రోహిణి కోర్టు
Delhi teen murder case | ఢిల్లీలోని షాబాద్ ఏరియాలో 16 ఏళ్ల బాలికను అత్యంత కిరాతకంగా హతమార్చిన కేసులో నిందితుడు సాహిల్‌ను ఢిల్లీ పోలీసులు ఇవాళ తెల్లవారుజామున న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు.
న్యూడిల్లీ: ఢిల్లీలోని షాబాద్ ఏరియాలో 16 ఏళ్ల బాలికను అత్యంత కిరాతకంగా హతమార్చిన కేసులో నిందితుడు సాహిల్‌ను ఢిల్లీ పోలీసులు ఇవాళ తెల్లవారుజామున న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. భద్రతాకారణాల రీత్యా నిందితుడిని కోర్టుకు కాకుండా రోహిణి కోర్టు డ్యూటీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జ్యోతి నాయిన్ ఇంటికి తీసుకెళ్లి ఆమె ముందు ప్రవేశపెట్టారు.
కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీసులు సమర్పించిన డాక్యుమెంట్లను పరిశీలించిన అనంతరం న్యాయమూర్తి నిందితుడికి రెండు రోజుల పోలీస్ కస్టడీ విధించారు. నిందితుడు సాహిల్ హత్యకు వినియోగించిన ఆయుధాన్ని ఇంకా స్వాధీనం చేసుకోలేదని, నిందితుడు మాటిమాటికి మాట మారుస్తున్నాడని, కాబట్టి కేసులో స్పష్టత కోసం నిందితుడిని తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు న్యాయమూర్తికి సమర్పించిన డాక్యుమెంట్లలో కోరినట్లు సమాచారం.
కాగా, నిందితుడు సాహిల్, హత్యకు గురైన బాలిక గత కొన్నాళ్లుగా రిలేషన్లో ఉన్నట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత ఆదివారం బాలిక రిలేషన్‌ను ఆపేద్దామని చెప్పడంతో సాహిల్ ఆగ్రహానికి లోనయ్యాడు. బాలికను కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు. ఆమె చనిపోయిన తర్వాత కూడా పక్కనున్న కంకర, సిమెంటుతో కూడిన గడ్డను తలపై మోదాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

