న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఓ ప్రయివేటు స్కూళ్లో కరోనా కలకలం సృష్టించింది. ఓ టీచర్‌తో పాటు విద్యార్థి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించబడ్డారు. దీంతో మిగతా విద్యార్థులందరూ సెలవులు ప్రకటించారు. అయితే ఢిల్లీలో కొత్తగా 299 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీకి సమీపంలోని నోయిడా, ఘజియాబాద్ల్లోనూ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీలోని ప్రయివేటు స్కూల్ కూడా ఈ ప్రాంతాలకు సమీపంలో ఉంది.
కరోనా కలకలంపై ఆప్ ఎమ్మెల్యే అతిషి స్పందించారు. ఒక టీచర్, విద్యార్థికి కరోనా పాజిటివ్ అని తేలిందని తమకు నివేదికలు వచ్చాయన్నారు. ఆ స్కూల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
దేశంలో కొత్తగా 1007 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,39,023కు చేరాయి. ఇందులో 4,25,06,228 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. మరో 11,058 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటి వరకు 5,21,737 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో 818 మంది కరోనా నుంచి బయటపడగా, ఒకరు మహమ్మారికి బలయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.