First JN.1 Case | ఢిల్లీలో తొలి JN.1 కేసు నమోదు.. వెల్లడించిన ఆరోగ్య మంత్రి
First JN.1 Case | దేశ రాజధాని ఢిల్లీలో తొలి JN.1 కేసు నమోదైంది. ఇవాళ మొత్తం ముగ్గురి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించగా అందులో ఒకరికి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ JN.1 సోకినట్లు తేలింది. మరో ఇద్దరిలో ఒమిక్రాన్ రకం కరోనా ఉన్నట్లు వెల్లడైంది. అయితే, ఢిల్లీలో JN.1 వేరియంట్ బయటపడటం ఇదే తొలిసారి అని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు.
First JN.1 Case: దేశ రాజధాని ఢిల్లీలో తొలి JN.1 కేసు నమోదైంది. ఇవాళ మొత్తం ముగ్గురి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించగా అందులో ఒకరికి ఒమిక్రాన్ సబ్ వేరియంట్ JN.1 సోకినట్లు తేలింది. మరో ఇద్దరిలో ఒమిక్రాన్ రకం కరోనా ఉన్నట్లు వెల్లడైంది. అయితే, ఢిల్లీలో JN.1 వేరియంట్ బయటపడటం ఇదే తొలిసారి అని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు.
కాగా, దేశంలో కరోనా వైరస్ (Coronavirus) వేగంగా వ్యాపిస్తున్నది. ఇవాళ కూడా 500 పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో 529 కొవిడ్ కేసులు వెలుగు చూశాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,093 పెరిగింది.
అదేవిధంగా మంగళవారం ఒక్కరోజే దేశంలో మూడు కరోనా మరణాలు నమోదయ్యాయి. కర్ణాటకలో ఇద్దరు, గుజరాత్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మూడు మరణాలతో కలిపి ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,33,340 కి చేరింది. మొత్తం 4,44,72,756 మంది కొవిడ్ బారినపడి కోలుకున్నారు.
ఇదిలావుంటే దేశంలో కరోనా సబ్ వేరియంట్ JN.1 చాపకింద నీరులా పాకుతున్నది. గడిచిన 24 గంటల్లో 40 JN.1 వేరియంట్ కేసులు బయటపడ్డాయి. మంగళవారం రాత్రి వరకు మొత్తం JN.1 కేసుల సంఖ్య 109కి చేరింది. అందులో అత్యధికంగా గుజరాత్లో 36 కేసులు, కర్ణాటకలో 34, గోవాలో 14, మహారాష్ట్రలో 9, కేరళలో 6, రాజస్థాన్‌లో 4, తమిళనాడులో 4, తెలంగాణలో 2 కేసులు రికార్డయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mini Cooper | ‘అన్నీ మా డాడి చూసుకుంటాడు’.. ముగ్గురి మృతికి కారణమైన యువకుడి తలపొగరు వ్యాఖ్య..?
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

