ఢిల్లీలో మంకీపాక్స్ నాలుగో కేసు… దేశంలో 9కి చేరిన సంఖ్య
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మంకీపాక్స్ నాలుగో కేసు నమోదైంది. 31 ఏళ్ల నైజీరియా మహిళకు మంకీపాక్స్ పాజిటివ్‌గా బుధవారం నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. ఇప్పటి వరకు మంకీపాక్స్ కేసులన్నీ ఢిల్లీ, కేరళలోనే నమోదయ్యాయి. మంగళవారం కూడా ఢిల్లీలో 35 ఏళ్ల విదేశీ వ్యక్తికి మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే అతడు ఇటీవల విదేశాల్లో ప్రయాణించలేదు. ప్రభుత్వ ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు. తాజాగా నైజీరియా మహిళకు మంకీపాక్స్ నిర్ధారణ కావడంతో ఢిల్లీలో ఈ కేసుల సంఖ్య నాలుగుకు పెరిగింది.
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటంపై ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు ఆందోళన చెందవద్దని సీఎం అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. అయితే మంకీపాక్స్ నిర్ధారణ, అనుమానిత రోగుల కోసం ఐసొలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలని మూడు ప్రైవేట్ ఆసుపత్రులను కోరారు.
కాగా, దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం 9 కేసుల్లో గరిష్ఠంగా కేరళలో ఐదు కేసులు నమోదయ్యాయి. యూఏఈ నుంచి కేరళకు తిరిగి వచ్చిన ఒక యువకుడు అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు. మరణాంతరం అతడికి మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi
- Monkeypox
- monkeypox case
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

