న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. లాక్డౌన్ మంచి ఫలితాలను ఇస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో కేవలం కొత్తగా 487 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు కాగా, 45 మంది మాత్రమే మరణించారు. ఈ ఏడాది మార్చి 16 తర్వాత ఢిల్లీలో అతి తక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 10వ తేదీ తర్వాత అతి తక్కువ మరణాలు నమోదు కావడం కూడా ఇదే ప్రథమం. గత 24 గంటల్లో కరోనా నుంచి 1,058 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. పాజిటివిటీ రేటు 0.61 శాతంగా ఉంది. ఢిల్లీలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య – 8,748.
COVID19 | Delhi records 487 fresh cases, 45 deaths and 1,058 recoveries in the last 24 hours; the Positivity rate drops to 0.61%. Active cases at 8,748 pic.twitter.com/iLX7Dd92Co
— ANI (@ANI) June 3, 2021