మీ సిటీలో తొలి ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదైందో తెలుసా..? ఆ విషయం తెలియాలంటే స్థానికంగా ఉన్న పోలీసు స్టేషన్‌కు వెళ్లాల్సిందే. అక్కడకు వెళ్లి ఏండ్ల క్రితం రికార్డులు పరిశీలిస్తే గానీ ఎప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైందో తెలియదు. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం తొలి ఎఫ్ఐఆర్ 1861, అక్టోబర్ 18న నమోదైంది. 160 ఏండ్ల క్రితం నాటి తొలి ఎఫ్ఐఆర్ కాపీని ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ స్పెషల్ డైరెక్టర్ యశోవర్ధన్ ఆజాద్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. హిస్టరీ ఈజ్ స్పెషల్ అని ట్యాగ్ చేశారు.
ఢిల్లీలోని కత్రా శిశు మహాల్‌కు చెందిన మయీద్దీన్ S/O మహ్మద్ యార్ ఖాన్ పేర తొలి ఎఫ్ఐఆర్ నమోదైంది. తన ఇంటి నుంచి హుక్కా స్మోకింగ్ పైప్, వంట పాత్రలు, ఐస్ క్రీంను దొంగిలించినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. వీటి విలువ 45 పైసలు ఉంటుందని ఎఫ్ఐఆర్ కాపీలో పోలీసులు వెల్లడించారు. ఈ ఎఫ్ఐఆర్ నార్త్ ఢిల్లీలోని సబ్జీ మండీలో నమోదైంది. ఈ కాపీని ఫ్రేమ్‌లో పొందుపరిచారు. ప్రదర్శన నిమిత్తం ఢిల్లీ పోలీస్ మ్యూజియంలో ఉంచారు. 160 ఏండ్ల క్రితం ఢిల్లీలో సబ్జీ మండీ, ముంద్కా, మేహ్రులి, కొత్వాలి, సదార్ బజార్ పోలీసు స్టేషన్లు ఉన్నాయి.
సబ్జీ మండీ పోలీసు స్టేషన్ పరిధిలో 11 ఆరెంజెస్‌ను దొంగిలించినందుకు 1891, ఫిబ్రవరి 16న ఎఫ్ఐఆర్ నమోదు కాగా, పైజామా దొంగతనం చేసినందుకు 1897, మార్చి 15న మరో ఎఫ్ఐఆర్ నమోదైంది.
1861 record of first FIR filed by Delhi police. A priceless piece and a treasured information @CPDelhi pic.twitter.com/m0MRp6Lcpu
— Yashovardhan Jha Azad (@yashoazad) October 22, 2021