న్యూఢిల్లీ : భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశాంగ మంత్రి జైశంకర్‌కు భద్రత పెంచారు. ఆయన కాన్వాయ్‌లో మరో రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను వినియోగించాలని కేంద్రం నిర్ణయించింది.
పహల్గాం ఘటన అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొనడంతో ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఒక అధికారి తెలిపారు. జైశంకర్‌కు గతంలో వై క్యాటగిరీ భద్రత ఉండగా, 2023 నుంచి జడ్ క్యాటగిరీ భద్రత కల్పిస్తున్నారు.