జంతర్ మంతర్‌కు నిరసన వేదిక హోదా రద్దు
జంతర్ మంతర్‌ను నిరసనలు, ప్రదర్శనలకు నిర్దేశిత వేదికగా గుర్తించే హోదాను ఢిల్లీ పోలీసులు సోమవారం రద్దు చేశారు. అటువంటి సమావేశాలు, ప్రదర్శనల కోసం మూడు ప్రత్యామ్నాయ ప్రదేశాలను వారు సూచించారు. శాంతియుత నిరసన చేపట్టేందుకు అనుమతి విషయంలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)తో ప్రతిష్ఠంభన నెలకొనడం, సుప్రీంకోర్టు ఇండియా కూటమి తలపెట్టిన పాదయాత్రకు ముందు రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేసిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
- మూడు వేరే ప్రత్యామ్నాయ ప్రదేశాల సూచన
- ఢిల్లీ పోలీసుల ఉత్తర్వు.. విపక్షాల ఆగ్రహం
న్యూఢిల్లీ, అక్టోబర్ 12: జంతర్ మంతర్‌ను నిరసనలు, ప్రదర్శనలకు నిర్దేశిత వేదికగా గుర్తించే హోదాను ఢిల్లీ పోలీసులు సోమవారం రద్దు చేశారు. అటువంటి సమావేశాలు, ప్రదర్శనల కోసం మూడు ప్రత్యామ్నాయ ప్రదేశాలను వారు సూచించారు. శాంతియుత నిరసన చేపట్టేందుకు అనుమతి విషయంలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)తో ప్రతిష్ఠంభన నెలకొనడం, సుప్రీంకోర్టు ఇండియా కూటమి తలపెట్టిన పాదయాత్రకు ముందు రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేసిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
ఈనెల 11న(ఆదివారం) నాటి ఒక స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం కొత్తగా నిర్ణయించిన మూడు వేదికల్లో పాత ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం, తూర్పు ఢిల్లీలోని సీబీడీ మైదానం, ఉత్తర ఢిల్లీలోని బురారీ మైదానం ఉన్నాయి. ఈ మూడు ప్రదేశాలు సెంట్రల్ ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి వరుసగా 3 కి.మీ, 13.5 కి.మీ, 44 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఢిల్లీ పోలీసు కమిషనర్ అనురాగ్కుమార్ సంతకంతో వెలువడిన ఈ ఉత్తర్వు జంతర్ మంతర్‌ను నిరసన వేదికగా నిర్దేశిస్తూ 2022 ఏప్రిల్ 28న జారీ చేసిన మునుపటి ఉత్తర్వును పాక్షికంగా సవరించింది. ఈ మూడు కొత్త వేదికల వద్ద నిరసనలు, ప్రదర్శనల నిర్వహణకు సంబంధించిన సమగ్రమైన, సవరించిన ప్రామాణిక కార్యకలాపాల విధానాలను (ఎస్ఓపీ) విడిగా జారీ చేస్తామని పోలీసులు తెలిపారు.
కాగా, జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన చేపట్టేందుకు అనుమతి విషయంలో సీజేపీ, ఢిల్లీ పోలీసుల మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభన నేపథ్యంలో ఈ ఆదేశం వెలువడింది. నిరసన ప్రదర్శన కోసం ఒక తేదీని కేటాయించాలన్న తమ డిమాండ్‌ను పునరుద్ఘాటిస్తూ, అనుమతి నిరాకరణకు గల కారణాలను కోరుతూ సీజేపీ నాయకులు సోమవారం పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. శాంతియుతంగా నిరసన తెలపాలన్న తమ ఉద్దేశం గురించి పోలీసులకు అధికారికంగా సమాచారం అందించామని, వారు ఆ సమాచారాన్ని స్వీకరించారని సీజేపీ ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు. అయితే నిరసనకు ఎటువంటి తేదీని ఖరారు చేయలేదని, అలాగే ఆంక్షలకు గల కారణాలపై తమకు ఎలాంటి వివరణ అందలేదన్నారు.
ఇక యావద్దేశం ‘జంతర్ మంతర్’గా మారుతుంది
ఢిల్లీ పోలీసుల ఉత్తర్వుపై దీప్కే రియాక్షన్
జంతర్ మంతర్‌ను నిరసన వేదికల జాబితా నుంచి తొలగించి దానికి బదులుగా మూడు ప్రత్యామ్నాయ ప్రదేశాలను ప్రవేశపెట్టాలన్న ఢిల్లీ పోలీసుల నిర్ణయం నేపథ్యంలో యావద్దేశం జంతర్ మంతర్‌గా మారిపోతుంది అంటూ సీజేపీ కన్వీనర్ అభిజీత్ దీప్కే హెచ్చరించారు. ప్రజాస్వామిక నిరసనలను ప్రభుత్వం అణచివేస్తున్నదని, అసమ్మతిని తెలిపే హక్కును లక్ష్యంగా చేసుకుంటున్నదని ఆయన ఆరోపించారు. వారు(ఢిల్లీ పోలీసులు) జంతర్ మంతర్‌ను అధికారిక నిరసన ప్రదేశం జాబితా నుంచి తొలగించారు. అవును, అది ఇకపై నిరసన ప్రదేశం కాదు. ఏదేమైనా ఆ పిరికి నియంత దానిని యుద్ధ క్షేత్రంగా మార్చేశారు. ఇప్పుడు యావద్దేశం జంతర్ మంతర్‌గా మారిపోతుంది అని ఎక్స్ వేదికగా దీప్కే పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

