న్యూఢిల్లీ: స్వామి చైతన్యానంద భారతి (స్వామి పార్ధసారథి) తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఢిల్లీలో 17 మంది విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలోని విలాసవంతమైన వసంత్ కుంజ్ ప్రాంతంలో ప్రముఖ మత సంస్థ అయిన శృంగేరిలోని దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠానికి చెందిన విద్యాసంస్థ నడుస్తున్నది.
దీనికి స్వామి చైతన్యానంద సరస్వతి డైరెక్టర్గా ఉన్నారు. ఆ సంస్థలో చదువుకుంటున్న పేద విద్యార్థినులను లక్ష్యంగా చేసుకుని స్వామీజీ లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. ‘నా గదికి రండి.. మిమ్మల్ని విదేశాలకు తీసుకెళ్తాను. దీని కోసం మీరేమీ చెల్లించనక్కర్లేదు’ అంటూ వారికి వాట్సాప్ మెసేజ్లు పంపేవాడు.