న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రి సత్యేందర్ జైన్‌ను మనీల్యాండరింగ్ కేసులో అరెస్టు చేసి తీహార్ జైలులో వేసిన విషయం తెలిసిందే. అయితే ఆ జైలులో సత్యేందర్‌కు సరైన భోజనం పెట్టడం లేదని ఆయన తరపున లాయర్ కోర్టులో వాదించారు. సత్యేందర్ 28 కేజీల బరువు తగ్గినట్లు ఆ లాయర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో తీహార్ జైలులో భోజనం చేస్తున్న సత్యేందర్ వీడియోను రిలీజ్ చేశారు. జైలులో చేరిన తర్వాత సత్యేందర్ 8 కిలోల బరువు పెరిగినట్లు తీహార్ జైలు అధికారులు వెల్లడించారు. సత్యేందర్ కడుపునిండా భోజనం చేస్తున్న జైలులోని సీసీటీవీ ఫూటేజ్ దృశ్యాలను రిలీజ్ చేశారు.
#WATCH | Latest CCTV footage sourced from Tihar jail sources show Delhi Minister Satyendar Jain getting proper food in the jail.
Tihar Jail sources said that Satyendar Jain has gained 8 kg of weight while being in jail, contrary to his lawyer's claims of him having lost 28 kgs. pic.twitter.com/cGEioHh5NM
— ANI (@ANI) November 23, 2022
మంత్రి సత్యేందర్ జైన్ జైలులో వీఐపీ సౌకర్యాలు పొందుతున్నారని ఇటీవల ఈడీ ఆరోపించిన విషయం తెలిసిందే. జైలులో ఆయన మసాజ్ పొందుతున్నారని, బిస్లరీ నీరు తాగుతున్నారని పేర్కొన్నది. ఆ ఆరోపణలకు చెందిన మసాజ్ వీడియోను కూడా ఇటీవల రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 13, 14 తేదీల్లో రికార్డు చేసిన రెండు వీడియో క్లిప్‌లను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి.