Home
National
Delhi Metro Services On The Day Of The Holi Festival March 8 Will Not Be Available Till 14 30 Hrs On All Lines
Delhi Metro | హోలీ రోజు మధ్యాహ్నం వరకు మెట్రో సర్వీసులు బంద్
Delhi Metro | హోలీ పండుగను పురస్కరించుకుని ఈ నెల 8న దేశ రాజధాని ఢిల్లీలో మధ్యాహ్నం 2.30 గంటల వరకు మెట్రో సర్వీసులను నిలిపివేయనున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ తెలిపింది.
న్యూఢిల్లీ: హోలీ పండుగను పురస్కరించుకుని ఈ నెల 8న దేశ రాజధాని ఢిల్లీలో మధ్యాహ్నం 2.30 గంటల వరకు మెట్రో సర్వీసులను నిలిపివేయనున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ తెలిపింది. ర్యాపిడ్, ఎయిర్‌పోర్టు లైన్లు రెండింటికి ఈ టైమింగ్స్ వర్తిస్తాయని పేర్కొన్నది. మధ్యాహ్నం 2.30 తర్వాత సర్వీసులను యథావిధిగా పునరుద్ధరించనున్నట్లు వెల్లడించింది.
అన్ని మెట్రోలైన్లలోని టెర్మినల్ స్టేషన్ల నుంచి రైళ్లు యథావిధిగా నడుస్తాయని డీఎంఆర్సీ ప్రకటించింది. మెట్రో రైళ్లతోపాటే మెట్రో ఫీడర్ బస్ సర్వీసులు కూడా హోలీ రోజు మధ్యాహ్నం 2.30 గంటల వరకు నడువవని, ఆ తర్వాత రైళ్లతోపాటు పునరుద్ధరించబడుతాయని తెలిపింది. హోలీరోజు ప్రయాణికులు రంగులు పులుముకుని ఎక్కడంవల్ల మెట్రో స్టేషన్లు, రైళ్లలో మరకలు అవుతాయన్న ఉద్దేశంతో డీఎంఆర్సీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

