న్యూఢిల్లీ: ఇటీవల జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ.. మేయర్ అభ్యర్థిగా షెల్లీ ఒబెరాయ్ పేరును ఖరారు చేసింది. అదేవిధంగా అలీ ముహమ్మద్ ఇక్బాల్‌ను ఢిల్లీ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా నిర్ణయించింది. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ సెక్రెటరీ పంకజ్ గుప్తా ఒక ప్రకటన చేశారు.
కాగా, ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక వచ్చే నెల 6న జరగనుంది. ఇటీవల జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మొత్తం 250 వార్డులకుగాను బీజేపీ 140 వార్డుల్లో విజయం సాధించింది. అప్పటిదాక మేయర్ పీఠంపై ఉన్న బీజేపీ 104 స్థానాలకు పరిమితమైంది. ఇక కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు స్థానాలతో సరిపెట్టుకుంది. స్వతంత్రులు మూడు స్థానాలను దక్కించుకున్నారు.