Delhi Murder Case | పెళ్లికి నిరాకరించిందనే కోపంతోనే ఆమెను మట్టుబెట్టాడు.. కీలక విషయాలు వెల్లడి
Delhi Murder Case | దేశ రాజధాని ఢిల్లీలో ఓ 25 ఏండ్ల యువతిని ఇనుపరాడ్డుతో కొట్టి చంపిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. పెళ్లికి నిరాకరించిందనే కోపంతోనే ఆమెను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
Delhi Murder Case | న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఓ 25 ఏండ్ల యువతిని ఇనుపరాడ్డుతో కొట్టి చంపిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. పెళ్లికి నిరాకరించిందనే కోపంతోనే ఆమెను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే ఆమెను సోమవారమే చంపాలనుకున్నాడు. కానీ వీలు కాలేదు. ఇక ప్రతి రోజు స్టెనోగ్రఫీ క్లాసులకు వెళ్తున్న ఆమెను ఢిల్లీ పార్కు వద్ద అడ్డుకుని, మాట్లాడుకుందామని చెప్పి లోపలికి తీసుకెళ్లాడు. పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి ఆమె నో చెప్పింది. దీంతో తన వెంట తెచ్చుకున్న ఇనుపరాడ్‌తో తలపై మోది చంపేశాడు.
మృతురాలు నర్గీస్ కమలా నెహ్రు కాలేజీ నుంచి గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. అయితే నర్గీస్‌ను నిందితుడు ఇర్ఫాన్ పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇర్ఫాన్ పెద్దగా చదువుకోలేదు. డెలివరీ ఏజెంట్‌గా పని చేస్తుండటంతో.. నర్గీస్ అతన్ని వ్యతిరేకించింది. ఇర్ఫాన్‌తో ఆమె మాట్లాడటం మానేసింది. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన ఇర్ఫాన్.. ఆమె ఓ ప్రణాళిక ప్రకారం చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

