ఘరానా విమాన చోరుడు అరెస్ట్
అతడో ఘరానా విమాన దొంగ.కేబిన్ బ్యాగ్‌లో ఉంచిన ప్రయాణికుల లగేజ్ పక్కన తన బ్యాగ్ ఉంచి నైపుణ్యంగా చోరీలకు పాల్పడే వాడు. ఒకటి కాదు రెండు కాదు గత ఏడాది 100 రోజుల పాటు అలా 200 విమానాల్లో వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి నూతన తరహాలో యథేచ్ఛగా చోరీలు చేసిన రాజేశ్ కుమార్ అనే నిందితుడు ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులకు చిక్కాడు.
- 110 రోజుల్లో 200 విమానాల్లో ప్రయాణం
- లక్షల కొద్దీ సొత్తు అపహరణ
న్యూఢిల్లీ: అతడో ఘరానా విమాన దొంగ.కేబిన్ బ్యాగ్‌లో ఉంచిన ప్రయాణికుల లగేజ్ పక్కన తన బ్యాగ్ ఉంచి నైపుణ్యంగా చోరీలకు పాల్పడే వాడు. ఒకటి కాదు రెండు కాదు గత ఏడాది 100 రోజుల పాటు అలా 200 విమానాల్లో వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి నూతన తరహాలో యథేచ్ఛగా చోరీలు చేసిన రాజేశ్ కుమార్ అనే నిందితుడు ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులకు చిక్కాడు. నిందితుడి ఇంటి నుంచి పెద్దయెత్తున బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి ఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో రిక్కీ డీలక్స్ అనే మూడంతస్తుల గెస్ట్ హౌస్, రెండు వ్యాపారాలు ఉన్నట్టు గుర్తించారు. కేసు వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమానంలో ప్రయాణం చేసిన ఒక మహిళ తన హ్యాండ్ బ్యాగ్‌లోని ఏడు లక్షల విలువైన నగలు, అమెరికా నుంచి వచ్చిన ఒక వ్యక్తి తన కేబిన్ బ్యాగ్ నుంచి 20 లక్షల విలువైన వస్తువులు అపహరణకు గురైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పలు ఫుటేజీలు పరిశీలించి రాజేశ్ కపూర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, తన నేరాలు ఒప్పుకున్నాడు. సాధారణంగా కనెక్టింగ్ ఫ్లయిట్లను ఎక్కేవారి వద్ద పెద్దమొత్తంలో నగలు, ఖరీదైన వస్తువులు ఉంటాయని, అందుకే అవి ఎక్కే వృద్ధులు, మహిళలను టార్గెట్‌గా చేసుకునేవాడినని నిందితుడు తెలిపాడు. గతంలో రైళ్లలో ఇలాగే దొంగతనాలు చేసేవాడని పోలీసులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi
- Flights
- MAN
- Rajesh Kumar
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

