సోమవారం 23 నవంబర్ 2020
National - Nov 12, 2020 , 15:32:42

ప్రైవేట్‌ దవాఖానల్లో 80 శాతం ఐసీయూ పడకలపై స్టే ఎత్తివేత

ప్రైవేట్‌ దవాఖానల్లో 80 శాతం ఐసీయూ పడకలపై స్టే ఎత్తివేత

న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతంలో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. దీంతో 33 ప్రైవేట్‌ దవాఖానల్లో కరోనా రోగులకు 80 శాతం ఐసీయూ పడకలు కేటాయించాలన్న ప్రభుత్వం ఆదేశాలపై గతంలో విధించిన స్టేను ఢిల్లీ హైకోర్టు ఎత్తివేసింది. గత మూడు నెలల్లో పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చిందని, అందుకే సెప్టెంబర్‌ 22న సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును వేకేట్‌ చేస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు గురువారం తెలిపింది. ప్రస్తుతం ఢిల్లీలో కరోనా పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే జాబితాలో పేర్కొన్న 33 ప్రైవేట్‌ దవాఖానలనే ఎంపిక చేయడానికి కారణం ఏమిటి, పడకలను ఎలా విభజిస్తారు అంటూ ఢిల్లీ ప్రభుత్వం తరుఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సంజయ్‌ జైన్‌ను న్యాయమూర్తులు హిమా కోహ్లీ, సుబ్రమణ్యం ప్రసాద్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ప్రశ్నించింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.