న్యూఢిల్లీ: లైంగిక దాడి, నిర్బంధం, శారీరక హింసకు స్నేహాన్ని రక్షణగా వాడుకోలేరని ఢిల్లీ హైకోర్ట్ ఓ కేసు విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. 17 ఏండ్ల బాలికను రేప్ చేసిన కేసులో నిందితుడికి ముందస్తు బెయిల్‌ను నిరాకరించింది. ‘పార్టీలిద్దరూ స్నేహితులైనా.. బాధితురాలిని పదేపదే అత్యాచారం చేయడానికి నిందితుడికి స్నేహం ఎలాంటి లైసెన్స్ ఇవ్వదు. ఆమెను తన స్నేహితుడి ఇంట్లో బంధించి దయ లేకుండా కొట్టడానికి అనుమతించదు’ అని పేర్కొంది.
బాధితురాలికి నిందితుడు పొరుగు వ్యక్తి కావడం వల్ల చాలా ఏండ్ల నుంచి తెలుసు. అతడు ఆమెను తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఎవరికీ చెప్పొద్దని ఆమెను బెదిరించాడు. ఘటన జరిగిన 11 రోజుల తర్వాత ఆలస్యంగా ఎఫ్ఐఆర్ నమోదైందని.. తమ ఇద్దరి మధ్య పరస్పర అంగీకారంతో కూడిన సంబంధం ఉందని నిందితుడు వాదించాడు. కోర్ట్ అతడి వాదనను తిరస్కరించింది.