న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు ప్రమాణం క్షీణ స్థితిలోనే(వెరీ పూర్) కొనసాగుతుండడంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(గ్రాప్)ని సవరించడం ద్వారా కాలుష్య నివారణ చర్యలను కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్(సీఏక్యూఎం) కఠినతరం చేసింది. ఢిల్లీ, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్‌లోని ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాలలో సిబ్బంది పనివేళలను కుదించడం అందులో ఒకటి.
కేంద్ర ప్రభుత్వం కూడా తన ఉద్యోగుల పని వేళలను తగ్గించే విషయాన్ని పరిశీలించాలని సీఏక్యూఎం సూచించింది.