2028 నుంచి పెట్రోల్ బైకుల రిజిస్ట్రేషన్ బంద్
దేశ రాజధానిలో స్వచ్ఛ రవాణా విధానం వైపు మళ్లింపును వేగవంతం చేసేందుకు రేఖా గుప్తా ప్రభుత్వం విస్తృత ప్రోత్సాహకాల ప్యాకేజీ ప్రకటించింది. లెఫ్టినెంట్ గవర్నర్ సంధు దీన్ని ఆమోదిస్తే జూలై 1 నుంచి దీన్ని అమలు చేస్తామని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సోమవారం తెలిపారు.
- రూ.30 లక్షల లోపు ఈ-కార్లకు పన్ను రాయితీ
- విద్యుత్తు వాహనాల పాలసీకి ఢిల్లీ సర్కార్ ఆమోదం
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో స్వచ్ఛ రవాణా విధానం వైపు మళ్లింపును వేగవంతం చేసేందుకు రేఖా గుప్తా ప్రభుత్వం విస్తృత ప్రోత్సాహకాల ప్యాకేజీ ప్రకటించింది. లెఫ్టినెంట్ గవర్నర్ సంధు దీన్ని ఆమోదిస్తే జూలై 1 నుంచి దీన్ని అమలు చేస్తామని ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సోమవారం తెలిపారు. ఈ విధానం 2030 మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని చెప్పారు. ఈ విధానంలో విద్యుత్తు కార్లకు పన్ను రాయితీ, కొనుగోలు ప్రోత్సాహకం ఇవ్వనున్నారు.
విద్యుత్తు ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసేవారికి మొదటి మూడేండ్లు వరుసగా రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు రాయితీగా ఇవ్వనున్నారు. విద్యుత్తు త్రిచక్ర వాహనాలు కొనేవారికి ఇదే విధంగా రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు ప్రోత్సాహకంగా ఇవ్వనున్నారు. 2027 జనవరి 1 నుంచి కేవలం విద్యుత్తు ఆటో రిక్షాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారు. కొత్త పెట్రోల్, సీఎన్జీ ఆధారిత ద్వి చక్ర వాహనాలకు 2028 ఏప్రిల్ 1 నుంచి రిజిస్ట్రేషన్లు చేయరు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

