Schools Closed | ఢిల్లీలో వరదల నేపథ్యంలో మరో రెండు రోజులు వరద ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలను మూసివేయాలని విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశించారు. ఈ నెల 17, 18 తేదీల్లోని ప్రభుత్వ, ఎయిడెడ్, గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలను తప్పనిసరిగా మూసివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. వరదల నేపథ్యంలో పాఠశాలల్లో సహాయక శిబిరాలు కొనసాగే అవకాశం ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో యమునా నది సరిహద్దు ప్రాంతాలు, వరద ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలు మూసివేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నార్త్‌వెస్ట్ బీ, వెస్ట్-ఏ, వెస్ట్బీ, సౌత్, సౌత్‌వెస్ట్ బీ, న్యూఢిల్లీలోని పాఠశాలలు సోమవారం నుంచి తెరువనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బుధవారం నుంచి పాఠశాలలు సాధారణంగా నడుస్తాయని వివరించారు. భారీ వర్షాల కారణంగా ఢిల్లీలో యమునా నదికి వరదలు పోటెత్తిన విషయం తెలిసిందే.