సెంట్రల్ ఢిల్లీ లాక్డౌన్
ఢిల్లీలోని రెండు ప్రధాన రైల్వేస్టేషన్లకు రైళ్లు రద్దు.. 57 మెట్రో స్టేషన్లు మూత.. క్యాబ్ సర్వీసులపై ఆంక్షలు.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేత.. దుకాణాలు మూత.. ఏకంగా 25 వేల మంది భద్రతా బలగాల మోహరింపు.. వంటి ఆంక్షలను చూస్తే, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) శనివారం ఢిల్లీలో చేపడుతున్న నిరసన పట్ల కేంద్రంలోని మోదీ సర్కార్ భయపడుతున్నట్టు కనిపిస్తున్నది.
- సీజేపీ నిరసనతో మోదీ సర్కార్ గజగజ
- సీఈసీ రాజీనామా డిమాండ్‌తో నేడు జంతర్‌మంతర్2.0
- అడ్డుకునేందుకు కేంద్రం కఠిన ఆంక్షలు
- 57 మెట్రోస్టేషన్ల మూత.. పలు రైళ్లు రద్దు
- 23 వేల మంది భద్రతాసిబ్బందితో పహారా
- ఇంటర్నెట్ బంద్.. దుకాణాల మూసివేత
- యాప్ ఆధారిత క్యాబ్‌ల పైనా ఆంక్షలు
- ఢిల్లీ వెళ్లకుండా అడ్డగింతలు, అరెస్టులు
- రైళ్ల నుంచి దించేసి యువత నిర్బంధం
న్యూఢిల్లీ, అక్టోబర్ 9: ఢిల్లీలోని రెండు ప్రధాన రైల్వేస్టేషన్లకు రైళ్లు రద్దు.. 57 మెట్రో స్టేషన్లు మూత.. క్యాబ్ సర్వీసులపై ఆంక్షలు.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేత.. దుకాణాలు మూత.. ఏకంగా 25 వేల మంది భద్రతా బలగాల మోహరింపు.. వంటి ఆంక్షలను చూస్తే, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) శనివారం ఢిల్లీలో చేపడుతున్న నిరసన పట్ల కేంద్రంలోని మోదీ సర్కార్ భయపడుతున్నట్టు కనిపిస్తున్నది.
దేశ రాజధానిలో కేంద్రం విధించిన అసాధారణ ఆంక్షలు అప్రకటిత లాక్‌డౌన్‌ను తలపిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా యువజనులు చేపట్టనున్న నిరసన కార్యక్రమాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వంతోపాటు ఢిల్లీ ప్రభుత్వం భారీ సంఖ్యలో భద్రతా బలగాలను సేకరించడంపై రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం, కేంద్రం చేస్తున్న ఏర్పాట్ల స్థాయిని చూసి, దేశ పౌరులతో ప్రభుత్వం యుద్ధం చేస్తున్నదా అని సీజేపీ నాయకులు ప్రశ్నిస్తుండగా శాంతిభద్రతల సంరక్షణకు ఈ చర్యలు అవసరమని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.
నిరసనలో యువత పాల్గొనకుండా అడ్డుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని సీజేపీ నాయకులు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అషుతోశ్ రాంకా ఆరోపించారు. ఢిల్లీ పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది నిరసన ప్రదర్శన కోసం ఏర్పాట్లు చేస్తున్న దృశ్యాలున్న వీడియోను పంచుకుంటూ నేను చెప్పినట్లుగానే భారత ప్రభుత్వం తన సొంత పౌరులతోనే యుద్ధం చేస్తున్నది. ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలే దీనికి నిదర్శనం అని ఎక్స్ వేదికగా సీజేపీ సహ-కన్వీనర్ సౌరవ్ దాస్ ఆరోపించారు. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శనివారం జరగనున్న సీజేపీ నిరసన కార్యక్రమం నేపథ్యంలో అక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఆంక్షలు కేవలం నిరసన జరిగే ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రజా రవాణా వ్యవస్థ, హోటళ్లు, రోడ్లు, రాజధానిలోని వాణిజ్య ప్రాంతాల వరకు విస్తరించనున్నాయి.

Cjp Pr
నిరసనకు అనుమతి లేదు
భారతీయ నాగరిక్ సురక్షా సంహిత(బీఎన్ఎస్ఎస్)లోని సెక్షన్ 163 కింద ఉన్న నిషేధాజ్ఞలను చూపుతూ ఈ నెల 10న సీజేపీ తలపెట్టిన నిరసన ప్రదర్శనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. నిర్వాహకులు కనీసం 10 రోజుల ముందే అనుమతి కోరాలన్న నిబంధన ఉన్నప్పటికీ సీజేపీ సహ-కన్వీనర్ సౌరవ్ దాస్ బుధవారం దరఖాస్తు సమర్పించారని నగర పోలీసు కమిషనర్ నూపుర్ ప్రసాద్ తెలిపారు.
23,000 మందితో పహారా
భద్రతా ఏర్పాట్లలో భాగంగా అక్టోబర్ 8,12 తేదీల మధ్య ఢిల్లీ పోలీసులకు సుమారు 23,000 మంది సిబ్బందితో కూడిన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సెస్(సీఏపీఎఫ్)కు చెందిన 221 కంపెనీలను అందుబాటులో ఉంచారు. నిరసన కార్యక్రమానికి సన్నద్ధమవుతున్న క్రమంలో పోలీసులు నిర్బంధ కేంద్రాలను(డిటెన్షన్ సెంటర్లు) సిద్ధం చేయడంతో పాటు రహదారులను అడ్డుకొనే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి, రవాణా, వసతి కల్పించే వారితో సమన్వయం చేసుకున్నారు.
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియలో అక్రమాలు జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ సీజేపీ, ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ) ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చాయి. ఓటర్ల పేర్ల తొలగింపునకు ఎన్నికల సంఘం సహకరించిందని వీరు ఆరోపిస్తున్నారు. కాగా, సెంట్రల్ ఢిల్లీలోని కీలక ప్రదేశాల వైపు రాకపోకలను నియంత్రించడానికి పోలీసులు ఊబర్, ఓలా వంటి క్యాబ్ అగ్రిగేటర్లతో సమన్వయం చేసుకుంటున్నారు. ఓయో, హోటళ్లను కొత్త బుకింగ్‌లను నిలిపివేయాలని కోరినట్టు సమాచారం.
సెంట్రల్ ఢిల్లీలో నేడు ఇంటర్నెట్ కట్
న్యూఢిల్లీలోని జన్‌పథ్-కర్తవ్య పథ్ కూడలి చుట్టూ 4 కిలోమీటర్ల పరిధిలో శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి శనివారం రాత్రి 10 గంటల వరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతాయి. ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయడానికి కేంద్ర హోం శాఖ ఆమోదం తెలిపినట్టు వార్తా సంస్థలు తెలిపాయి. ఆ ప్రాంతంలో అన్ని రకాల మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం.

Traffic
కన్నాట్ ప్లేస్‌లో నేడు దుకాణాలు బంద్
దేశ రాజధానిలో జరగనున్న నిరసనల దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా శనివారం కన్నాట్ ప్లేస్‌లోని దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లు, ఇతర సంస్థలు మూసి ఉంచాలని న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్(ఎన్డీటీఏ) శుక్రవారం జారీచేసిన ఒక అడ్వైజరీలో సూచించింది. అధికారుల సూచనలు, కన్నాట్ ప్లేస్ పరిసరాల్లోని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్డీటీఏ అధ్యక్షుడు అతుల్ భార్గవ తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అప్రమత్తంగా ఉండాలని, తమ సూచనలకు సహకరించాలని దుకాణ యజమానులు, వాణిజ్య సంస్థల నిర్వాహకులను ఆయన కోరారు. శనివారం జరగనున్న నిరసనల సమయంలో ఆస్తి నష్టం, గాయాలు సంభవించే అవకాశంపై ఉన్న ఆందోళనలను ఆయన ప్రస్తావించారు. సీజేపీ నిరసనల నేపథ్యంలో ఈ సర్క్యులర్ జారీచేశారు.
ప్రజలను అడ్డుకుంటున్నారు
ప్రజలు నిరసనలో పాల్గొనకుండా అడ్డుకొనేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని సీజేపీ నాయకులు ఆరోపించారు. నిరసనకు ముందు దేశవ్యాప్తంగా వేలాది మంది యువకులను అదుపులోకి తీసుకున్నారని సీజేపీ వ్యవస్థాపకుడు, కన్వీనర్ అభిజీత్ దీప్కే ఆరోపించారు. శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఇలాంటి బెదిరింపులు ఉద్యమాన్ని ఏమాత్రం అడ్డుకోలేవని ఆయన పేర్కొన్నారు. అలాగే, అనుమతి నిరాకరించినప్పటికీ తాను ఢిల్లీకి వెళ్లి జంతర్ మంతర్ వరకు ర్యాలీగా వెళతానని ఆయన ప్రకటించారు. ఏది ఏమైనా సరే మేము జంతర్ మంతర్ వరకు ర్యాలీగా వెళతాము అని దీప్కే పేర్కొన్నారు.
భారీగా ట్రాఫిక్ జామ్..
సీజేపీ నిరసనల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని ప్రధాన రహదారుల్లో శుక్రవారం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహన దారులు గంటల తరబడి చిక్కుకుపోయారు. ఢిల్లీ-నోయిడా రూట్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
రైళ్ల రద్దు
శనివారం ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లకు చేరుకోవలసిన మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను అవి బయల్దేరే స్టేషన్ల వద్దనే రద్దు చేస్తున్నారు. ఈ రద్దు శనివారం మధ్యాహ్నం 2 గంటల తర్వాత బయలుదేరే రైళ్లకు కూడా వర్తిస్తాయి. స్టేషన్ల చుట్టూ తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ, రహదారుల దిగ్బంధం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి 57 మెట్రో స్టేషన్ల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను మూసివేయాలని, అలాగే శనివారం రైళ్ల రాకపోకల సంఖ్యను తగ్గించే విషయాన్ని పరిశీలించాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌ను ఢిల్లీ పోలీసులు కోరారు. సెంట్రల్ ఢిల్లీలోని సున్నితమైన ప్రాంతాలకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరాకుండా నిరోధించడమే ఈ ప్రతిపాదిత ఆంక్షల ఉద్దేశం అని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

