Minish Sisodia | ఢిల్లీ మద్యం పాలసీ కేసు (Delhi Excise Policy Case)లో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia) జ్యుడీషియల్ కస్టడీని సీబీఐ కోర్టు (CBI Court) ఈ నెల 17వ తేదీ వరకు పొడిగించింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని సీబీఐ కోర్టుకు తెలిపింది. దర్యాప్తు సంస్థ వాదనలు విన్న కోర్టు కస్టడీని పొడిగించింది. మద్యం పాలసీ వ్యవహారంలో ఫిబ్రవరి 26న మనీష్ సిసోడియా సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
దాదాపు ఎనిమిది గంటలకుపైగా విచారించిన ఆయనను అరెస్టు చేసినట్లు సీబీఐ ప్రకటించింది. ఆ తర్వాత ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. ఆ తర్వాత సీబీఐ కస్టడీకి ఇచ్చింది. విచారణ అనంతరం ఆయనను జ్యుడీషియల్ కస్టడీపై జైలుకు పంపింది. ఇదే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సైతం అరెస్టు చేసింది. ఈడీ కేసులో మనీశ్ సిసోడియా బెయిల్ కోసం దరఖాస్తు చేయగా.. ఈ నెల 5న విచారణ జరుగనున్నది.