న్యూఢిల్లీ: ఢిల్లీలో జరుగుతున్న నిరసనలను దృష్టిలో ఉంచుకుని శాంతి భద్రతల పరిరక్షణకు భారీగా భద్రతా దళాలను మోహరించారు. హోంశాఖ తెలిపిన వివరాల ప్రకారం 221 కంపెనీలకు చెందిన సుమారు 21 వేల మందిని ఈ నెల 8-12 మధ్య ఢిల్లీలో మోహరించనున్నారు.
వీటిలో కాక్రోచ్ జనతా పార్టీ జూలైలో నిర్వహించిన నిరసనల దృష్ట్యా అందుబాటులో ఉంచిన 111 కంపెనీలు, అక్టోబర్లో మంజూరైన 110 కంపెనీలు ఉన్నాయి. ఈ మోహరింపు కోసం సీఆర్పీఎఫ్ కంపెనీలను వివిధ ప్రాంతాల నుంచి తరలిస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం శుక్ర, శనివారాలు రెండు రోజులపాటు ఢిల్లీలో మద్యం దుకాణాలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, జంతర్ మంతర్ వద్ద ఎలాంటి నిరసనకూ అనుమతి ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు.