Delhi CP : ఎర్రకోట సమీపంలోని మెట్రో స్టేషన్ సిగ్నల్ దగ్గర కారులో సంభవించిన భారీ పేలుడు(Car Blast)తో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసిన ఈ ఘటనలో ఇప్పటికే 10 మంది మరణించారు. జనాలను భయాందోళనలకు గురి చేసిన ఈ పేలుడు గురించిన వివరాలను పోలీస్ కమిషనర్ శ్రీ సతీశ్ గుల్చా (Sri Satish Gulcha) వెల్లడించారు. సిగ్నల్ దగ్గర కారు ఆగి ఆగగానే పెద్ద శబ్బంతో పేలుడు సంభవించిందని ఆయన ఎన్ఐఏ, మీడియాతో తెలిపారు.
పేలుడు గురించిన సమాచారం తెలిసిన వెంటనే ఢిల్లీ సీపీ ఘటనా స్థలికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని గమనించిన ఆయన మీడియాతో ప్రమాదం వివరాలను చెప్పారు. ‘ సోమవారం సాయంత్రం 6:52 గంటలకు పేలుడు జరిగింది. ఎర్రకోట సిగ్నల్ వద్ద కారు స్లో అయింది. సిగ్నల్ లైట్ దగ్గర కారు ఆగుతుండగానే ఒక్కసారిగా అందులో భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి సమీపంలోని దుకాణాలు ధ్వంసం అయ్యాయి. ఘటనాస్థలికి ఎన్ఐఏ(NIA), ఫొరెన్సిక్ బృందాలు చేరుకున్నాయి. తాజా పరిస్థితి గురించి హోం మంత్రి అమిత్ షా (Amit Shah) వాకబు చేశారు’ అని సీపీ పేర్కొన్నారు.
Delhi Police Commissioner Satish Golcha on blast-#RedFort #HomeMinister #लालकिले pic.twitter.com/fXmhDw25Cv
— NEWSDAILY MEDIA GROUP (@NEWSDAILY123) November 10, 2025
పేలుడు కారణంగా మరణించిన పది మంది మృతదేహాలు ఛిద్రమయ్యాయి. తీవ్రంగా గాయపడిన 34 మందికి లోక్ నాయక్ జయప్రకాశ్ హాస్పిట్లో చికిత్స అందిస్తున్నారు. పేలుడుతో అప్రమత్తమైన పోలీసులు ఎర్రకోట, చాందీని చౌక్ వెళ్లే దారులను మూసేశాం. ఈ దాడికి సూసైడ్ బాంబర్ కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే.. విచారణ తర్వాత దాడికి సూత్రధారి ఎవరు? అనే వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.
#WATCH | Delhi: Forensic team arrives at the spot after the blast near Gate no 1 of the Red Fort Metro station in Delhi
Delhi Police Commissioner Satish Golcha said, “Today at around 6.52 pm, a slow-moving vehicle stopped at the red light. An explosion happened in that vehicle,… pic.twitter.com/rQeXcLYQ69
— ANI (@ANI) November 10, 2025