land for job scam | లాలూ యాదవ్, భార్య రబ్రీ దేవి, కుమార్తెలు, ఇతరులకు ఢిల్లీ కోర్టు సమన్లు
land for job scam | బీహార్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, మాజీ సీఎం రబ్రీ దేవి, వారి కుమార్తెలు హేమా యాదవ్, మిశా భారతి, ఇతరులకు ఢిల్లీ కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది.
న్యూఢిల్లీ: బీహార్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, మాజీ సీఎం రబ్రీ దేవి, వారి కుమార్తెలు హేమా యాదవ్, మిశా భారతి, ఇతరులకు ఢిల్లీ కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది. ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ (land for job scam) కేసులో విచారణకు ఫిబ్రవరి 9న కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. లాలూ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై ఆరోపణలున్న మనీలాండరింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టు అంగీకరించింది.
ఈ కేసులో రబ్రీ దేవి, హేమా యాదవ్, మిసా భారతి, అమిత్ కత్యాలీ, హృదయానంద్ చౌదరి, తదితరుల పేర్లను తొలి చార్జిషీట్లో ఈడీ పేర్కొంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన లాలూ, ఆయన కుటుంబం వద్ద కీలక ఆధారాలు ఉన్నాయని కోర్టుకు ఈడీ తెలిపింది. ఈ నేపథ్యంలో నిందితులు కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం ఉందని కోర్టు భావించింది. ఫిబ్రవరి 9న కోర్టుకు హాజరుకావాలని ఆదేశిస్తూ శనివారం సమన్లు జారీ చేసింది.
కాగా, ఒకవైపు బీహార్‌లో రాజకీయ గందరగోళం నెలకొన్న తరుణంలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబానికి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది. జేడీ(యూ) చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ మళ్లీ బీజేపీతో జత కట్టేందుకు సిద్ధమయ్యారు. ఆర్జేడీ ప్రభుత్వం నుంచి తప్పుకుని సీఎం పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తున్నది. అలాగే ఆదివారం సీఎంగా మరోసారి ప్రమాణ స్వీకారం చేయడంతోపాటు ఎన్డీఏ కూటమితో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manchi Venkat | ‘ఆదర్శ కుటుంబం’లో ‘పర్ణశాల’ పాట వివాదం.. సినిమాను బతికించండంటూ నిర్మాత ఆవేదన
Filmmaker Sanjay Gupta | బాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా కన్నుమూత!
PM Modi: ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రశంసించిన ప్రధాని మోదీ
YS Sharmila | బెంగళూరులోని యలహంక ప్యాలెస్ నా బిడ్డల హక్కు : వైఎస్ షర్మిల
Drinking Water | రాష్ట్రంలో మొదలైన తాగునీటి కష్టాలు.. ఈ దృశ్యాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

