గురువారం 04 జూన్ 2020
National - May 09, 2020 , 08:33:28

ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ సస్పెండ్

 ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ సస్పెండ్

న్యూఢిల్లీ: వ్య‌క్తిని కొట్టిన ఘ‌ట‌నలో ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ పై స‌స్పెన్ష‌న్ వేటు ప‌డ్డ‌ది. ఇమ్రాన్ అనే వ్య‌క్తి పార్కులో జ‌నాలను ఆలింగ‌నం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు రావ‌డంతో సంగ‌ర్పూర్ పోలీస్ స్టేష‌న్ లో విధులు నిర్వ‌ర్తిస్తున్న కానిస్టేబుల్ తోపాటు స్థానికులు ఇమ్రాన్ పై దాడి చేసిన వీడియో చ‌క్క‌ర్లు కొట్టింది.

ఈ ఘ‌ట‌న‌పై ఉన్న‌తాధికారులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తున‌కు ఆదేశించారు. ఇమ్రాన్ త‌న సోద‌రి ఇంటికి వెళ్లి..ఆ త‌ర్వాత మ‌సీదుకు వెళ్లి న‌డుచుకుంటూ వ‌స్తోన్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంద‌ని కుటుంబ‌సభ్యులు తెలిపారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo