అక్టోబర్ 26న కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న ఖర్గే
Mallikarjun Kharge | కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి శశిథరూర్‌పై ఘన విజయం సాధించిన మల్లిఖార్జున్ ఖర్గే ఈ నెల 26న
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి శశిథరూర్‌పై ఘన విజయం సాధించిన మల్లిఖార్జున్ ఖర్గే ఈ నెల 26న పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, ఎంపీ రణ్‌దీప్ సుర్జేవాలా మీడియాకు వెల్లడించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం ఈ నెల 17న పోలింగ్ జరిగింది.
ఇవాళ ఢిల్లీలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. మొత్తం 9,385 ఓట్లు పోలవగా అందులో 7,897 ఓట్లు ఖర్గేకు పడ్డాయి. శశిథరూర్‌కు కేవలం 1072 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో 416 ఓట్లు చెల్లకుండా పోయాయి. దాంతో ఖర్గే పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ వెల్లడించారు.
ఎన్నికల ఫలితాలు వెల్లడైన అనంతరం మీడియాతో మాట్లాడిన ఖర్గే.. తమ పార్టీలో చిన్న, పెద్ద అనే తారతమ్యాలేమీ ఉండవన్నారు. అందరం కలిసికట్టుగా కార్యకర్తల్లా పనిచేస్తామని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడి చేస్తున్న ఫాసిస్ట్ పార్టీలకు వ్యతిరేకంగా తామంతా కలిసికట్టుగా పోరాడుతామని ఆయన చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

