ప్రస్తుతం వెంకటేష్‌తో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్నారు కల్యాణ్‌రామ్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్నది. ఇదిలావుండగా కల్యాణ్‌రామ్ మరో సినిమాకు ఓకే చెప్పారని తెలిసింది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తెరకెక్కించబోతున్న ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తారని సమాచారం.
‘ఫ్యామిలీ స్టార్’ పరాజయంతో దర్శకుడు పరశురామ్ కెరీర్‌కు కాస్త బ్రేక్‌నిచ్చారు. తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఓ యూనిక్ పాయింట్‌తో కథను సిద్ధం చేశారని తెలిసింది. దీనిని కల్యాణ్‌రామ్‌కి వినిపించగా ఆయన సానుకూలంగా స్పందించారని ఫిల్మ్‌నగర్ టాక్ వినిపిస్తున్నది. అయితే ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.