న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి జరిగింది. బుధవారం ఉదయం అధికారిక నివాసంలో ‘జన్ సున్వాయి’(ప్రజావాణి) కార్యక్రమంలో ప్రజలతో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చి.. కొన్ని పేపర్లు అందజేశాడు. హఠాత్తుగా ఆమె చేయి పట్టుకుని తనవైపు లాక్కునేందుకు ప్రయత్నించాడు.
ఈ క్రమంలో పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో సీఎం తలకు స్వల్ప గాయమైంది. అక్కడ ఉన్నవారు అతడిని బంధించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని హత్యాయత్నం కేసు నమోదుచేశారు. నిందితుడు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన రాజేశ్‌భాయ్ సకారియా(42)గా గుర్తించారు. అతడు జంతు ప్రేమికుడిగా తెలుస్తున్నది.