న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఈడీ అధికారులు ఆయనను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పర్చనున్నారు. అయితే మరోసారి తమ కస్టడీకి ఇవ్వాలని కోరనున్నట్లు తెలుస్తున్నది.
కాగా, మార్చి 22న కేజ్రీవాల్‌ను అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఆ గడువు మార్చి 28న ముగియడంతో కోర్టులో హాజరుపరుచగా ఢిల్లీ సీఎంకు మరో మూడు రోజులు కస్టడీ విధించింది. నేటితో అది ముగుస్తుండటంతో ఆయన కస్టడీని కోర్టు మరోసారి పొడిగిస్తుందా లేక జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలిస్తుందా అనే అంశంపై ఆసక్తి నెలకొన్నది. అయితే, తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఇప్పటికే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్ పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది.