న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రసిద్ధ చాందినీ చౌక్ మార్కెట్‌ను ఢిల్లీ ప్రభుత్వం అభివృద్ధి చేసింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ దీనిని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చాందినీ చౌక్ ద్వారా ఢిల్లీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిందని అన్నారు. ఈ ప్రాంతం గతంలో అడ్డదిడ్డమైన రోడ్డు, ట్రాఫిక్ జామ్‌లు, వేలాడే వైర్లతో కనిపించేదని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం చాందినీ చౌక్ అభివృద్ధి ప్రాజెక్టును మూడేండ్లలో పూర్తి చేసిందని తెలిపారు.
ఢిల్లీలో చారిత్రక ఎర్రకోట నుంచి ఫతేపురి మసీదు వరకు విస్తరించిన చాందినీ చౌక్ ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశంగా మారిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఈ పర్యాటక ప్రదేశాన్ని ఇంకా అభివృద్ధి చేసేందుకు చాలా ఆలోచనలు తమకు ఉన్నాయని వివరించారు. ఇక్కడి మార్కెట్లను రాత్రి వేళ మూసివేసిన మరో 3-4 గంటల పాటు స్ట్రీట్ ఫుడ్స్‌ను అనుమతిస్తామని వెల్లడించారు.
Restoration of a 400-year-old legacy is now complete! 🇮🇳 💯
— AAP (@AamAadmiParty) September 11, 2021
CM @ArvindKejriwal will inaugurate the redeveloped Chandni Chowk tomorrow! pic.twitter.com/0EbEv0pL5K