న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. కోవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించిన బూస్టర్ డోసులు ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని అభ్యర్థించారు. ఇక నుంచి ఢిల్లీలో పాజిటివ్ వచ్చే కేసులన్నింటికీ జీనోమ్ సీక్వెన్సింగ్ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ఢిల్లీ సీఎం తెలిపారు. ప్రజలు ఆందోళన చెందవద్దు అన్నారు. ఒమిక్రాన్ ప్రభావం మైల్డ్‌గా ఉందని నిపుణులు చెబుతున్నారని, ఒమిక్రాన్ వల్ల హాస్పిటల్లో చేరుతున్నవారి సంఖ్య, మరణాలు తక్కువగా ఉన్నట్లు కేజ్రీ చెప్పారు.