Death Threat | ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా (Rekha Gupta)కు హత్య బెదిరింపులు (Death Threat) వచ్చాయి. సీఎంను చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లో బెదిరించారు. ఈ బెదిరింపు కాల్తో అప్రమత్తమైన పోలీసులు.. ఫోన్ నంబర్ ఆధారంగా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఘజియాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్ (Ghaziabad Police Control Room)కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి ఢిల్లీ సీఎం రేఖా గుప్తాను చంపేస్తానని బెదిరించి ఫోన్ పెట్టేశాడు. దీంతో అప్రమత్తమైన ఘజియాబాద్ పోలీసులు ఈ విషయాన్ని వెంటనే ఢిల్లీ పోలీసులకు (Delhi Police) తెలియజేశారు. అలర్ట్ అయిన ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కొత్వాలి పోలీస్ స్టేషన్ ప్రాంతం నుంచి ఫోన్ కాల్ వచ్చినట్లు గుర్తించారు. అయితే, ఆ ఫోన్ నంబర్ స్విచ్ఆఫ్ అని వస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read..
Bomb Threat | కర్ణాటక సీఎంకు బాంబు బెదిరింపులు.. ఆత్మాహుతి దాడికి ప్లాన్
Vande Bharat Express: కోల్డ్ వెదర్ తట్టుకునేరీతిలో.. కశ్మీర్ వందేభారత్ రైలు
NEET PG 2025 | నీట్ పీజీ పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు ఓకే