న్యూఢిల్లీ : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ సీఎంకు ఈడీ జారీ చేసిన సమన్లను (ED Summons) బుధవారం మూడోసారి కూడా అరవింద్ కేజ్రీవాల్ బేఖాతరు చేశారు. తనకు సమన్లు జారీ చేసేందుకు దర్యాప్తు సంస్ధ సహేతుక కారణం వెల్లడించలేదని ఈడీకి రాసిన లేఖలో కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈడీ ఈ అంశంలో అనవసరమైన గోప్యతను పాటిస్తోందని, ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
తనను విచారణకు పిలవడం వెనుక నిజమైన ఉద్దేశం, పరిధి, స్వభావం, విస్తృతిని అర్థం చేసుకోవడానికి నాకు వీలు కల్పించే పరిస్ధితిని స్పష్టం చేయండని అరవింద్ కేజ్రీవాల్ ఈ లేఖలో కేంద్ర ఏజెన్సీని కోరారు. మరోవైపు ఈడీ సమన్లపై ఆప్ (AAP) తీవ్రంగా స్పందించింది. ఈ నోటీసులు అక్రమమని, తమ పార్టీ అధినేతను అరెస్ట్ చేసే ఉద్దేశంతోనే వాటిని ఇచ్చారని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది.
అయితే, దర్యాప్తు సంస్థలకు సహకరించేందుకు సీఎం కేజ్రీవాల్ సిద్ధంగా ఉన్నారని తెలిపింది. ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఈ నోటీసులు ఎందుకు పంపారు..? అని ప్రశ్నించింది. ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే నోటీసులు పంపారని ఆరోపించింది.
Read More :