న్యూఢిల్లీ, నవంబర్18 : ఢిల్లీ కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తునకు సంబంధించి అల్-ఫలాహ్ వర్సిటీ వ్యవస్థాపకుడు జావెద్ అహ్మద్ సిద్దిఖీని ఈడీ మంగళవారం అరెస్టు చేసింది. అల్-ఫలాహ్ గ్రూప్‌తో సంబంధమున్న కార్యాలయాల్లో సోదాల అనంతరం సిద్దిఖీ నుంచి మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ఈడీ సిద్ధమైంది.
అల్-ఫలాహ్ గ్రూప్, వర్సిటీని నడపటంలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిద్దిఖీ, కారు బాంబు పేలుడు ఘటనతో ఆయనకున్న సంబంధాన్ని ఛేదించేందుకు దర్యాప్తు అధికారులు ప్రయత్నిస్తున్నారు.