న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యంగా మారిన యమునా నదిలో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా (Delhi BJP chief hospitalised) స్నానమాచరించారు. 2025 నాటికి ఈ నదిని శుద్ధి చేస్తామని హామీ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. నది శుభ్రత కోసం కేటాయించిన నిధులను ఆప్ ప్రభుత్వం దుర్వినియోగం చేయడంతోపాటు అవినీతికి పాల్పడిందని వీరేంద్ర సచ్‌దేవా ఆరోపించారు. దీనికి గాను క్షమాపణ కోరడం కోసం నిరసనగా గురువారం ఐటీఓ సమీపంలోని యమునా ఘాట్‌లోని నీటిలో తన తలను ముంచారు.
Virendra Sachdeva
కాగా, కాలుష్య యమునా నదిలో స్నానమారించిన వీరేంద్ర సచ్‌దేవా అనంతరం అస్వస్థతకు గురయ్యారు. చర్మంపై తీవ్ర దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలతో ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో ఆయన చేరారు. పరీక్షించిన డాక్టర్లు వీరేంద్ర సచ్దేవాకు చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు ఇదంతా బీజేపీ డ్రామా అని ఢిల్లీ పర్యావరణ మంత్రి, ఆప్ సీనియర్ నేత గోపాల్ రాయ్ విమర్శించారు. ఉత్తర ప్రదేశ్, హర్యానాలోని బీజేపీ ప్రభుత్వాలు శుద్ధి చేయని పారిశ్రామిక వ్యర్థ జలాలతో యమునా నదిని కలుషితం చేస్తున్నాయని ఆరోపించారు.
BJP Delhi state president Virendra Sachdeva admitted in hospital 48 after taking a dip in Yamuna, was suffering from rashes and itching pic.twitter.com/dugICEyT9n
— Social News Daily (@SocialNewsDail2) October 26, 2024