Aeroplane | న్యూఢిల్లీ: పొగ మంచు, దారి కనిపించకపోవడం, వర్షాలు, సాంకేతిక కారణాల వల్ల భారత్లో ఇటీవల తరచూ విమాన సర్వీసులు ఆలస్యమవుతున్నాయి. వీటికి తోడు బాంబు బెదిరింపులు, ప్రయాణికుల రద్దీ,, రన్ వేపై దిగడంలో సమస్యలు వంటివాటి వల్ల విమానాలు బయల్దేరడంలో ఆలస్యం జరుగుతున్నది.
ముఖ్యంగా ఢిల్లీ విమానాశ్రయంలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల విమానం కనీసం రెండు గంటలు ఆలస్యమయ్యే అవకాశం ఉంటే, దానిలోని ప్రయాణికులను దించేయాలని, అది బయల్దేరినపుడు మరోసారి భద్రతాపరమైన తనిఖీలు చేయరాదని ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు నిర్ణయించారు.