Delegations : భారత్ (India) కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమేగాక మన దేశంపై విషం చిమ్ముతున్న పాకిస్థాన్ (Pakistan) ను అంతర్జాతీయంగా ఎండగట్టేందుకు కేంద్రం ఏడు అఖిలపక్ష బృందాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ఏడు బృందాలకు ఒక్కో బృందానికి ఒక్కొక్కరు చొప్పున శశిథరూర్ (కాంగ్రెస్), రవిశంకర్ ప్రసాద్ (బీజేపీ), బైజయంత్ పాండా (బీజేపీ), సంజయ్‌కుమార్ ఝా (జేడీ-యూ), కనిమొళి (డీఎంకే), సుప్రియా సూలె (ఎన్సీపీ-ఎస్పీ), శ్రీకాంత్ శిండే (శివసేన) లు నేతృత్వం వహిస్తున్నారు.
దేశం తరఫున జాతీయ ఏకాభిప్రాయాన్ని ప్రపంచానికి చాటడం కోసం ఐరాస భద్రతామండలిలోని దేశాలకు ఈ బృందాలు వెళ్లనున్నాయి. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని తెలియజేసింది. అదేవిధంగా ఏయే బృందాలు ఏయే దేశాలకు వెళ్తాయనే జాబితాను కూడా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. శశిథరూర్ టీమ్ అమెరికా తదితర దేశాలకు, కనిమొళి టీమ్ రష్యా తదితర దేశాలకు వెళ్లనున్నాయి. ఏ టీమ్ ఎక్కడెక్కడికి వెళ్తుందనే వివరాలు కింది విధంగా ఉన్నాయి.
శశిథరూర్ టీమ్ : అమెరికా, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియా
కనిమొళి బృందం : రష్యా, స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా, లాట్వియా
రవిశంకర్ ప్రసాద్ టీమ్ : యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఈయూ, ఇటలీ, డెన్మార్క్
సుప్రియా సూలే టీమ్ : ఈజిప్ట్, ఖతార్, ఇథియోపియా, దక్షిణాఫ్రికా
బైజయంత్ పాండా టీమ్ : సౌదీఅరేబియా, కువైట్, బహ్రెయిన్, అల్జీరియా
సంజయ్‌కుమార్ ఝా టీమ్ : ఇండోనేసియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, జపాన్, సింగపూర్
శ్రీకాంత్ శిండే టీమ్ : యూఏఈ, లైబీరియా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, సియెర్రా లియోన్