Veerappa Moily : కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్‌కు పద్మ అవార్డు ప్రకటించడంపై కాంగ్రెస్‌లో వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఒకరు ఈ అవార్డు ప్రకటనకు అనుకూలంగా, ఒకరు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన విషయం కూడా తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ కూడా కామెంట్స్ చేశారు. కేవలం రాజకీయ ధృక్కోణంలోనే ఈ అవార్డు ప్రకటనను చూడాల్సి వుంటుందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. కేవలం రాజకీయ ధృక్కోణంలోనే కేంద్రం ఈ అవార్డు ప్రకటించిందే తప్ప, గుణ దోషాలను, పనితనాన్ని పరిగణనలోకి తీసుకొని ఎంత మాత్రమూ ప్రకటించలేదని వీరప్ప మొయిలీ తేల్చి చెప్పారు. పద్మ అవార్డు స్వీకరిస్తే, కాంగ్రెస్‌కు నష్టమని భావిస్తే, గులాంనబీ ఆ అవార్డును స్వీకరించకూడదని పేర్కొన్నారు. ‘గులాంనబీ ఆజాద్‌కు పద్మ అవార్డు ప్రకటించడం ఫక్తు రాజకీయ నిర్ణయమే. మెరిట్ ఆధారం కాదు. మరే ఇతర ప్రాతిపదికన కాదు. అవార్డు తీసుకోవాలా? వద్దా? అనేది గులాంనబీయే నిర్ణయించుకోవాల్సి వుంటుంది.’ అని వీరప్ప మొయిలీ పేర్కొన్నారు.