ప్రయాగ్‌రాజ్: ఉత్తర్‌ప్రదేశ్‌లో విద్యార్థులు తీవ్ర ఆందోళన చేస్తున్న క్రమంలో కీలక పరీక్షను ఒకే రోజు ఒకే షిఫ్ట్‌లో నిర్వహించాలని ఆ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. దీని ప్రకారం ప్రొవెన్షియల్ సివిల్ సర్వీస్ (పీసీఎస్) ప్రిలిమ్స్ పరీక్ష ఒకే రోజు జరగనుండగా, రిక్రూట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ల రిక్రూట్ పరీక్షలను ఒకే షిష్ట్‌లో నిర్వహణకు గల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయడానికి ఒక కమిటీని వేయాలని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయంపై విద్యార్థులు సంతృప్తి చెందలేదు. నోటిమాటతో హామీ ఇస్తే సరిపోదని, నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
చెన్నై: ‘లాటరీ కింగ్’గా పేరొందిన చెన్నైకి చెందిన లాటరీ, గేమింగ్ వ్యాపారి శాంటియాగో మార్టిన్ ఆస్తులపై ఈడీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. మార్టిన్‌తో పాటు ఆయన అల్లుడు ఆధవ్ అర్జున్, అనుచరుల ఇండ్లు, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. చెన్నై, కోయంబత్తూర్, ఫరీదాబాద్, లుధియానా, కోల్‌కతాలో ఏకకాలంలో దాదాపు 20 చోట్ల దాడులు జరిగాయి.