కల్తీ మద్యం మృతుల సంఖ్య 39.. తాగితే చనిపోతారన్న సీఎం నితీశ్
Chapra hooch tragedy : బీహార్‌లో కల్తీ మద్యం తాగిన కేసులో మృతిచెందిన వారి సంఖ్య 39కి చేరుకున్నది. శరన్ జిల్లాలోని చాప్రా ప్రాంతంలో జరిగిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. దీనిపై ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ స్పందించారు.
పాట్నా: బీహార్‌లో కల్తీ మద్యం తాగిన కేసులో మృతిచెందిన వారి సంఖ్య 39కి చేరుకున్నది. శరన్ జిల్లాలోని చాప్రా ప్రాంతంలో జరిగిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. దీనిపై ఆ రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ స్పందించారు. కల్తీ మద్యం సేవిస్తే, ప్రాణాలు కోల్పోతారని ఆయన అన్నారు. చాప్రా విషాదంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మద్య నిషేధం లేని రోజుల్లో కూడా ఇక్కడ కల్తీ మద్యం తాగి జనం చనిపోయినట్లు సీఎం తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలు జరిగాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇక్కడ లిక్కర్ బ్యాన్ ఉందని, కల్తీ మద్యాన్ని అమ్ముతారని, దాని వల్ల ప్రజలు చనిపోతారని, మద్యం మంచిది కాదని, ఎవరూ తాగకూడదని సీఎం నితీశ్ అన్నారు.
కల్తీ మద్యం తాగి మృతిచెందిన వారికి నష్టపరిహారం ఇవ్వాలని గతంలో కొందరు డిమాండ్ చేశారని, ఎవరైనా మద్యం సేవిస్తే ప్రాణాలు కోల్పోవడం తప్పదని, మన కళ్ల ముందే ఇవన్నీ కనిపిస్తున్నాయని, ఇలాంటి ఘటనలు విషాదాన్ని మిగిల్చుతాయని, ఆ ప్రాంతాలను విజిట్ చేసి, వారికి కల్తీ మద్యం గురించి వివరించాలని సీఎం నితీశ్ తెలిపారు. పేదలను అరెస్టు చేయవద్దు అని అధికారుల్ని ఆదేశించానని, కానీ లిక్కర్‌ను తయారు చేసేవాళ్లను, ఆ వ్యాపారాన్ని నిర్వహించేవాళ్లను పట్టుకోవాలని ఆదేశించినట్లు సీఎం నితీశ్ తెలిపారు.
మద్య నిషేధం వల్ల చాలా మంది ప్రజలు బెనిఫిట్ పొందారని, ఎంతో మంది మద్యాన్ని త్యజించారని, ఇది మంచి పరిణామం అని, అనేక మంది మద్య నిషేధ నిర్ణయాన్ని స్వాగతించారని, కానీ కొందరు ఎప్పుడూ సమస్యలు సృష్టిస్తుంటారని, అలాంటి వాళ్లను పట్టుకోమని అధికారులకు ఆదేశించినట్లు సీఎం నితీశ్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

