న్యూఢిల్లీ, జులై 15: కేరళ నర్సు నిమిష ప్రియకు ఈ నెల 16న యెమెన్లో అమలు జరగవలసిన మరణ శిక్ష వాయిదాపడినట్లు మంగళవారం ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. హతుడు తలాల్ అబ్దో మెహదీ కుటుంబంతో చర్చలు జరిపి పరస్పర ఆమోదయోగ్య పరిష్కారం కనుగొనేందుకు నిమిష కుటుంబ సభ్యులకు మరింత సమయం ఇవ్వాలని యెమెన్ ప్రభుత్వానికి నచ్చచెప్పే కాగా, నిమిషకు క్షమాభిక్ష ప్రసాదించేందుకు బదులుగా బ్లడ్ మనీ స్వీకరించాలని మెహదీ కుటుంబ సభ్యులను ఒప్పించేందుకు ప్రముఖ సున్నీ ముస్లిం నాయకుడు కాంతాపురం ఏపీ అబుబకర్ ముస్లియర్ రంగంలోకి దిగారు. కాంతాపురం ప్రోద్బలంతో సూఫీ నాయకుడు షేక్ హబీబ్ ఉమర్ బీన్ హఫీజ్ నాయకత్వంలో సమావేశం జరిగింది. మెహదీ కుటుంబ సభ్యులతో ఉమ ర్ బిన్ హఫీజ్కి చెందిన ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.